బన్నీ-త్రివిక్రమ్ సినిమా ముహూర్తం ఫిక్స్

బన్నీ-త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ సినిమాకి ముహూర్తం ఫిక్సయింది. ఈ నెల 24 నుంచి సినిమా మొదలుకానుంది. సోమవారం బన్నీ పుట్టినరోజు సందర్భంగా.. దర్శకుడు త్రివిక్రమ్ బన్నీ ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.ఇందులో బన్నీకి జంటగా పూజా హెగ్డే జతకట్టనుంది. వీరిద్దరు జతకట్టడం ఇది రెండోసారి. ‘డీజే-దువ్వాడ జగన్నాథమ్’ సినిమా కోసం బన్నీ-పూజా జంటగా నటించిన సంగతి తెలిసిందే.

ఇక, బన్నీ పుట్టినరోజు సందర్భంగా మరో రెండు సినిమాలకి సంబంధించిన అధికారిక ప్రకటనలు వచ్చేశాయి. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ 20వ సినిమా తెరకెక్కనుంది. త్రివిక్రమ్ సినిమా తర్వాత సుకుమార్ సినిమా ఉండనుంది. ఈ రెండు సినిమాల తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉండనుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తారు. ఈ చిత్రానికి ఐకాన్ అనే టైటిల్ పెట్టారు. ‘కనబడటం లేదు’ అన్నది ట్యాగ్ లైన్. మొత్తానికి ఇకపై బన్నీ బిజీ బిజీ.. !