పవన్ ఇంత దిగజారాడు ఏంటీ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా మంచోడు. ఆయన అభిమానిలా చెప్పాలంటే దేవుడు. ఇప్పుడీ దేవుడు రాజకీయాల్లో బిజీ అయ్యాక.. మాములు మనిషిలా మారాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై పవన్ చాలా మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రైతుల కోసం కేసీఆర్ మంచి పనులు చేస్తున్నారని పవన్ అన్నారు. ప్రత్యేకంగా కేసీఆర్ ని కలిసి అభినందించారు కూడా. అదే పవన్ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పై ఓ రేంజ్ లో విరుచుపడుతున్నారు.

తెలంగాణలో ఆంధ్రావాళ్లని కొడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేశారు. అలీ విషయంలోనూ పవన్ వ్యవహార శైలి బాధాకరం. అలీ.. ఇదేనా స్నేహమంటే ? అని ప్రశ్నించాడు. అలీని ఆదుకొన్నానని అన్నారు. దీనిపై అలీ స్పందిస్తూ.. పవన్ తనకి ఆర్థిక సాయం చేయలేదు. సినిమా ఆఫర్లు ఇప్పించలేదు. ఆయన హీరో కాకముందే తాను కమెడియన్ గా బిజీ అయ్యా. ఆయనలా మెగాస్టార్ తమ్ముడిలా సినిమాల్లోకి రాలేదు. 15యేళ్లు కష్టపడి పైకొచ్చానన్నారు అలీ.

అంతేకాదు.. తాను వైకాపాలో చేరితే తప్పేంటీ? ఆ స్వేచ్చ నాకు లేదా? నిజంగానే తనపై పవన్ కి ప్రేముంటే. తన ఫోన్ నెంబర్ ఆయన దగ్గరుంది. అలీ.. నేను సొంత పార్టీ పెట్టాను. నా పార్టీలో చేరు అని ఎందుకు అనలేదు. బహుశా.. పవన్ పక్కనున్న వాళ్లు తనపై ఆయన చేత కామెంట్స్ చేసి ఉంటారన్నారని అలీ అన్నారు. అలీ, కేసీఆర్ ని పవన్ అన్నాడు అని కాదు. కానీ, నిజంగా పవన్ రాజకీయాల్లో బిజీ అయ్యాక బాగా మారాడు. ఫక్తు పొలిటిషన్ అయిపోయాడు. మరీ మార్పు మంచికా? చెడుకా ? మే 9న తేలనుంది. ఆ రోజే ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి.. మరీ !


@RepalleTdpCandidate @JaiTDP