మావోల దాడిలో బీజేపీ ఎమ్మెల్యే మృతి

ఎన్నికల వేళ మావోలు షాక్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న దంతేవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మండవి కాన్వాయ్ ని పేల్చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే సహా ఐదుగురు మృతి చెందారు. బస్తర్ లోసభ బీజేపీ అభ్యర్థి బైదురాం కశ్యప్ తరపున ప్రచారానికి సహచర ఎమ్మెల్యేలతో కలిసి భీమా మండవ వెళ్తున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ చివరలో వెళ్తుంది. దాన్ని మావోలు టార్గెట్ చేసి పేల్చేశారు. రోడ్డు నిర్మాణం జరుగుతున్న సమయంలోని మావోలు మందుపాత్రని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

మందపాత్ర పేల్చిన తర్వాత కూడా మావోలు ఎమ్మెల్యేలా కాన్వాయ్ పై కాల్పులు జరిపారు. సీఆర్‌పీఎప్ సిబ్బంది మావోల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దంతేవాడలో ఎన్నికలను బహిష్కరించాలని మావోలు పిలుపునిచ్చారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి కూడ తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఐతే, పోలింగ్ కి ముందే ఎమ్మెల్యే కాన్వాయ్ ని పేల్చేసిన మావోలు.. దంతేవాడలో భయనిక పరిస్థితులు సృష్టించారు.