‘జెర్సీ’ సినిమాని అప్పుడే 20సార్లు చూశా : నాని

నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘జెర్సీ’. గౌతమ్‌ తిన్ననూరి దర్శకుడు. శ్రద్ధ శ్రీనాథ్‌ కథానాయిక. సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ నిర్మిస్తోంది. వచ్చేవారం (ఏప్రిల్ 19) జెర్సీ ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం ‘జెర్సీ’ చిత్రబృందం మీడియా సమావేశం నిర్వహించింది. ఏప్రిల్ 19న జెర్సీ రావడం లేదు. వాయిదాపడే అవకాశాలున్నాయని జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చింది. అనుకొన్న టైం ఏప్రిల్ 19న సినిమా రాబోతుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడారు. “ఇప్పటికే జెర్సీ సినిమాని 20 సార్లు చూసేశా. స్క్రీన్ మీద ఉన్నది తాను కాదన్నట్లు మైమరచి పోయి మరీ సినిమా చూడడం ఇదే తొలిసారి. సినిమాలో అస్సలు నాని కనిపించడు. అర్జున్ మాత్రమే కనిపిస్తాడు. నటుడిగా సంతృప్తినిచ్చిన చిత్రమిది” అన్నారు. ఇక ఈ సినిమాని చైనాలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్నీ కుదిరితే నాని సినిమా విదేశాల్లో ఆడనుంది. అప్పుడు నేచురల్ స్టార్ కాస్త గ్లోబల్ స్టార్ అవుతాడేమో !