రజనీ167 టైటిల్ ‘దర్భార్’ !

ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ 167వ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా టైటిల్ ఫిక్సయ్యింది. ‘దర్భార్’ పేరు పెట్టారు. టైటిల్ పోస్టర్ ని కూడా వదిలారు. రజనీ చుట్టూ తుపాకులు, తూటాలు, బేడీలు, పోలీస్ డాగ్స్ తో ఫస్ట్ లుక్ ఆకట్టుకొనేలా ఉంది. మురుగదాస్ – రజనీ కలయికలో వస్తున్న మొదటి చిత్రమిది. ముంబై నేపథ్యంలో సాగే కథ ఇది.

ఇందులో రజినీ పోలీస్ ఆఫీసర్ గా, సోషల్ యాక్టివిస్ట్ గా రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. పోలీస్ పాత్ర సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఆ పాత్రనే చాలా స్టయిలీష్ గా డిజైన్ చేసి ఫస్ట్ లుక్ ని వదిలినట్టు తెలుస్తోంది. రజనీ జంటగా నయనతార జతకట్టనుంది. రజినీ కుమార్తె పాత్రలో నివేదా థామస్ కనిపించనుందని సమాచారమ్.

రేపటి (ఏప్రిల్ 10) నుంచే ‘దర్భార్’ రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానుంది. 2020 పొంగల్ కి ‘దర్భార్’ని ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తొంది.