గ్లాస్ మేట్స్ వీడియో సాంగ్ చూశారా ?


ఈ వారం ప్రేక్షకుల ముందుకురాబోతున్న చిత్రం ‘చిత్రలహరి’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయి తేజు హీరోగా నటించిన చిత్రమిది. కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ హీరోయిన్స్ . సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమా రిలీజ్ కి ఇంకా రెండ్రోజులే ఉండటంతో ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్రబృందం. తాజాగా, గ్లాస్ మేట్స్ సాంగ్ ట్రైలర్ ని విడుదల చేసింది.

ఇందులో తేజు, సునీల్ కలిసి చేసిన హంగామా చూడొచ్చు. ముఖ్యంగా సునీల్ డ్యాన్స్ తో పాటు ఎక్స్ ప్రెషన్స్ తో చంపేశారు. గ్లాస్ మేట్స్ సాంగ్ వినడానికి, చూడ్దానికి కూడా అద్భుతంగా ఉంది. గ్లాస్ మేట్స్ సాంగ్ ట్రైలర్ ని మీరు చూసేయండీ.. !