‘కల్కీ’ టీజర్ టాక్

గరుడవేగ’తో మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చేశారు సీనియర్ హీరో రాజశేఖర్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కల్కీ’. ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఇందులో రాజశేఖర్‌ భార్య పాత్రలో అదా శర్మ నటిస్తున్నారు. మరో హీరోయిన్ గా నందితా శ్వేతా కనిపించనున్నారు. సి.కల్యాణ్‌, శివానీ రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌ సినిమాను నిర్మిస్తున్నారు

తాజాగా, ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. మంచి మూడులో టీజర్ సాగింది. ఒక్క డైలాగ్ లేకుండా.. కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ చేస్తూ టీజర్ ని ఆకట్టుకొనేలా కట్ చేశారు. యుద్ధం వచ్చే ముందు నిశబ్ధ విప్లవంలా టీజర్ ఉంది. ఆఖర్ లో రాజశేఖర్ పోలీస్ జీపుపై కూర్చొని కూల్ గా కనిపించారు రాజశేఖర్. ప్రస్తుతం జెడ్ స్వీడుతో షూటింగ్ జరుపుకొంటున్న కల్కీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.