గేల్ మాస్, రాహుల్ క్లాస్ !

ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ XI పంజాబ్‌ 4వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టుకి ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (100 నాటౌట్‌, 64 బంతుల్లో 6×4, 6×6), క్రిస్‌గేల్‌ (63, 36 బంతుల్లో 3×4, 7×6) మంచి శుభారంభాన్ని ఇచ్చారు. గేల్ మాస్, రాహుల్ క్లాస్ ఆటని ప్రేక్షకులు ఫుల్లుగా ఎంజాయ్ చేశారు.

198 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్‌ 9ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. సిద్దేశ్‌లాడ్‌(15), సూర్యకుమార్‌(21), క్వింటన్‌ డికాక్‌(24) వరుసగా ఔటవ్వడంతో ముంబయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రిజులో కీరణ్‌ పొలార్డ్‌(2), ఇషాన్‌ కిషన్‌ ఆడుతున్నారు. పొలార్డ్ పైనే ముంబై గెలుపు ఆశలు పెట్టుకొంది. ఈ మ్యాచ్ లో పొలార్డ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. రోహిత్ గాయపడటంతో.. ఆయన స్థానంలో పొలార్డ్ ని కెప్టెన్ గా నియమించారు.