ఆడపిల్ల పుట్టిందని హాస్పిటల్ కి రాలేదు : రేణు దేశాయ్
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. కమెడియన్, వైసీపీ నేత అలీతో కలవడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీ ఎన్నికల ప్రచారంలో పవన్-అలీ కామెంట్స్ హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేణు అలీతో కలిసి పవన్ బదనాం చేయబోతుందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అలీ వాఖ్యతగా వ్యవహరిస్తున్న ‘అలీతో సరదాగా’ కార్యక్రమానికి రేణు హాజరయ్యారు. ఈ ఏపీసోడ్ సోమవారం ప్రసారం కానుంది. తాజాగా, ఈ ప్రోగ్రామ్ ప్రోమో వదిలారు.
ఇందులో రేణు ఆసక్తికర విషయాలు చెప్పారు. పవన్, ఫ్యామిలీ, పిల్లలు, సినిమాలు, పవన్ తో గొడవులు, విడాకులు.. తదితర అంశాలపై రేణు మాట్లాడినట్టు తెలుస్తోంది. ఖుషి, జానీ సినిమాలకి రేణు ఎడిటర్ గా పని చేశారు. ఐతే, ఆ రెండు సినిమాలకి తనకి రెమ్యూనరేషన్ ఇవ్వలేదు. దీనికి పవన్ సాక్ష్యం. కావాలంటే ఆయన్ని అడగండి అని రేణు చెప్పింది. అంతేకాదు.. రేణు పుట్టినప్పుడు ఆమె తండ్రి ఆడపిల్ల పుట్టిందని హాస్పటిల్ కి రాలేదట. ఇక, తన కూతురు ఆద్యా తనకు ప్రాణం. తను లేనిదే ఉండలేనని చెప్పింది.
పవన్-రేణు ఎందుకు విడిపోయారు ? కారణాలేంటీ ?? అనేది ఎవరికీ తెలియదు. దీనిపై ఎప్పుడు పవన్ గానీ, రేణు గానీ నోరు తెరవలేదు. ఐతే, ఆ కారణాలని అలీ రేణుదేశాయ్ తో చెప్పించి ఉంటారనే కామెంట్స్ వినబడుతున్నాయి. ఆ వివరాలు తెలియాలంటే సోమవారం ఈటీవీలో ప్రసారమయ్యే అలీతో సరదాగా ప్రోగ్రామ్ చూడాల్సిందే.