వరల్డ్ కప్ నుంచి రోహిత్ అవుట్ ?


వరల్డ్ కప్ ముందు టీమిండియా గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనబడుతోంది. ఐపీఎల్12లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిరుత్సాహంగా కనిపిస్తున్నారు. ఆయన కెప్టెన్ గా వ్యవహరిస్తున్న బెంగళూరు జట్టు ఇప్పటి వరకు విజయాల ఖాత తెరవలేదు. వరుసగా ఆరు మ్యాచ్ ల్లో ఓడింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ గా కోహ్లీ సామర్థ్యాన్ని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. కొందరైతే.. కోహ్లీ స్థానంలో రోహిత్ కి కెప్టెన్ బాధ్యతలు అప్పగించాలనే కామెంట్స్ చేస్తున్నారు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే ? రోహిత్ కూడా గాయపడ్డాడు.

మంగళవారం నెట్స్‌లో ప్రాక్టీస్ భాగంగా.. ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రోహిత్ గాయపడ్డారు. ఆయన తొడ కండరాలకు గాయమైంది. ఫిజియో నితిన్ పటేల్ రోహిత్ ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తర్వాత రోహిత్ మళ్లీ ప్రాక్టీస్ చేయలేదు. దీంతో రోహిత్ గాయం పెద్దదేనని తెలుస్తోంది. బుధవారం పంజాబ్‌తో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్ లో రోహిత్ ఆడతాడో లేదో చూడాలి. ఇక, ఈ నెల 15న వరల్డ్‌కప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనున్న సంగతి తెలిసిందే.