‘కబీర్ సింగ్’ ఎప్పటికీ ‘అర్జకున్ రెడ్డి’ కాలేడు !


‘ఒరిజినల్ సినిమా ఎప్పుడూ ఒరిజినల్ సినిమాయే’. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా తీయడం కష్టం. ఇప్పుడు అర్జున్ రెడి సినిమా విషయంలో అదే జరుగుతోంది. కోలీవుడ్ లో అర్జున్ రెడ్డి ‘వర్మ’గా తెరకెక్కుతోంది. షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ఐతే, వర్మ అర్జున్ రెడ్డిలో రేంజ్ లో రాలేదని మళ్లీ రీ-షూట్ చేస్తున్నారు. దర్శకుడు, హీరోయిన్ ని మార్చేశారు. ఇక, బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మాతృక దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నారు. కైరా అద్వానీ హీరోయిన్.

ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలైంది. ‘అర్జున్ రెడ్డి’లో ఉన్నది ఉన్నట్టుగా కబీర్ సింగ్ టీజర్ ని దించేశారు. ఐతే, విజయ్ దేవరకొండతో పోలిస్తే షాహిద్ కపూర్ తేలిపోయాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు.. కబీర్ సింగ్ టీజర్ తో విజయ్, షాహిద్ కపూర్ అభిమానుల మధ్య పెద్ద వార్ మొదలైంది. కబీర్ సింగ్ టీజర్ అర్జున్ రెడ్ది టీజర్ కంటే బాగుందని షాహిద్ కపూర్ అభిమానులు మొదలెట్టారు. విజయ్ ఫ్యాన్స్ ఊరుకొంటారా ? ముందే రౌడీలు. ఓ రేంజ్ లో వేసుకొంటున్నారు.

‘కబీర్ సింగ్’ ఎప్పటికీ ‘అర్జకున్ రెడ్డి’ స్థాయిని అందుకోలేదు. విజయ్ దేవరకొండ లెజెండ్. షాహిద్ ఒక కుర్రకుంక అంటూ విజయ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒరిజినల్ సినిమా ఎప్పుడూ ఒరిజినల్ సినిమాయే. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చేయలేం. షాహిద్ నటించిన కమీనే, హైదర్, ఉడ్తా పంజాబ్ చిత్రాలు రీమేక్ చేస్తే… ఆ పాత్రలకు ఎవరు న్యాయం చేయలేరని మరికొందరు అంటున్నారు.