ద్వివేదికి తప్పని ఈవీఎం తిప్పలు
ఆంధ్రప్రదేష్ లో ఎన్నికలు ఏమాత్రం సజావుగా సాగడం లేదు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాగా, ఆ పోలింగ్ కేంద్రంలోనే ఈవీఎంలు పనిచేయలేదు. దీంతో ఆయన వెనుతిరగక తప్పలేదు. ఉదయం నుంచి 319 ఈవీఎంలను బాగు చేసినట్లు స్వయంగా ద్వివేదియే ప్రకటించారు.
మరోవైపు, ఎన్నికలపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని ద్వివేది ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 30శాతం ఈవీఎంలు పనిచేయడం లేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రకటించడం విశేషం. ఇక, పలు చోట్ల టీడీపీ-వైకాపా నేతల మధ్య వాగ్వాదం జరుగుతోంది. పలు చోట్ల వైకాపా నేతలు రిగింగ్ కు పాల్పడుతున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.