రాహుల్’కు ప్రాణ హాని

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమేఠిలో నామినేషన్‌ వేసేందుకు రాహుల్‌ వెళ్లిన సమయంలో.. రాహుల్‌ తలపై లేజర్‌ లైట్‌ పడింది. ఇది స్నైపర్‌ రైఫిల్‌ నుంచి వచ్చి ఉంటుందని కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేంద్ర హోంశాఖకి లేఖ కూడా రాశారు. రాహుల్‌ మీడియాతో మాట్లాడుతున్న వీడియోను కూడా హోంశాఖకు కాంగ్రెస్‌ అందించారు. కొన్ని సెకన్లలోనే 7సార్లు రాహుల్ పై లేజర్‌ లైట్‌ పడింది.

మరోవైపు, రాహుల్‌ భద్రతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఆ లైట్‌ రైఫిల్‌ నుంచి రాలేదని.. సెల్‌ఫోన్‌ నుంచి వచ్చిందని ఎస్పీజీ డైరెక్టర్‌ చెప్పినట్లు హోంశాఖ స్పష్టం చేసింది. అంతేకాదు.. రాహుల్ భద్రత విషయంలో కాంగ్రెస్ తనకు ఎలాంటి లేక రాయలేదని స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీలు హత్య చేయబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ భద్రతపై కాంగ్రెస్ నేతలు మరింత జాగ్రత్తపడుతున్నట్టు కనిపిస్తోంది.