అవార్డు : టాలీవుడ్‌ ఉత్తమ కోడలు సమంత

టాలీవుడ్‌ ఉత్తమ కోడలుగా అవార్డు దక్కించుకొంది స్టార్ హీరోయిన్ సమంత. ఈ అవార్డుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇవ్వడం విశేషం. ‘బి పాజిటివ్- హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్’ మ్యాగజైన్‌కు చీఫ్ ఎడిటర్‌గా ఉపాసన బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మ్యాగజైన్‌ కవర్‌ ఫొటోపై పలువురు సినీ ప్రముఖులు కనిపించారు. హృతిక్‌ రోషన్‌, ఐశ్వర్యరాయ్‌, కత్రినా కైఫ్‌, రామ్‌ చరణ్‌, షాహిద్‌ కపూర్‌, ఆలియా భట్‌, కృతి సనన్‌ తదితరులు దర్శనమిచ్చారు. తమ ఫిట్‌నెస్‌ రహస్యాల్ని పంచుకున్నారు.

ఏప్రిల్‌ మ్యాగజైన్‌ కవర్‌ ఫొటోపై సమంత కనిపించారు. ఇటీవల దీనికి సంబంధించిన ఫొటోషూట్‌ జరిగింది. ఉపాసన స్వయంగా సమంతను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోల్ని ఉపాసన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘స్వీటెస్ట్‌, శక్తిమంతమైన సమంత.. టాలీవుడ్‌ బెస్ట్‌ కోడలి అవార్డు ఆమెకే’ అంటూ సరదాగా ట్వీట్‌ చేశారు. దీనిపై అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక, పెళ్లి తర్వాత సామ్-చై తొలిసారి కలిసి నటించిన మజిలీ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ తెచ్చుకొంది.