ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయొచ్చు
ఓటరు జాబితాలో పేరుండి కూడా కొందరు ఓటు హక్కుని వినియోగించుకోలేకపోతున్నారు. ఓటరు గుర్తింపు కార్డు లేకపోవడం, ఓటరు స్లిప్ అందకపోవడమే ఇందుకు కారణం. ఐతే, ఓటరు జాబితాలో పేరుండి, ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా 11 రకాల ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి చూపించి ఓటేయొచ్చు. పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్సు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థల కంపెనీలు ఉద్యోగులకు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులు, బ్యాంకులు, తపాలా కార్యాలయాలు జారీ చేసిన పాస్‌పుస్తకాలు (ఫొటో ఉండాలి), ఉపాధి హామీ జాబ్‌కార్డు, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్, ఆధార్ కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటేయొచ్చు.