గిన్నిస్‌కు నిజామాబాద్‌ ఎన్నిక

తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలను ప్రశాంతంగా ముగిశాయి. 62.25 శాతం ఓటింగ్‌ నమోదైనట్టు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 75.61 శాతం పోలింగ్‌ నమోదైంది. అతితక్కువగా హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 39.49 శాతంగా నమోదైంది. 185 మంది పోటీలో ఉన్న నిజామాబాద్‌లో 54.20 శాతంగా ఉంది. అంతేకాదు.. నిజామాబాద్ ఎన్నికని గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లో చేర్చాలని కోరుతూ ఈసీ లేఖ రాసింది.

నిజామాబాద్‌లో 27,185 బ్యాలెట్‌ యూనిట్లు(బీయూ)లు వాడగా అందులో 261 బీయూలు, 55 కంట్రోల్‌ యూనిట్లు(సీయూ)లు, 87 వీవీప్యాట్‌లను మాత్రమే మార్చామని ఈసీ తెలిపింది. పోలింగ్‌ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 398 బీయూలు, 318 సీయూలు, 1252 వీవీప్యాట్‌లను మార్చినట్లు ఈసీ తెలిపింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిజామాబాద్‌ ఎన్నికని నిర్వహించడంలో ఎన్నికల సంఘం విజయవంతం అయ్యింది. ఇక, మే 23న లోక్ సభ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అప్పటి వరకు స్ట్రాంగ్‌రూంల వద్ద రెండంచెల భద్రత ఏర్పాటు చేయనున్నట్టు ఈసీ తెలిపింది.