‘మజిలీ’పై ‘చిత్రలహరి’ ఎఫెక్ట్ లేనట్టే.. !

ఎన్నికలు హడావుడి, ఐపీఎల్ హంగామా మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మజిలీ’ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. దర్శకుడు శివ నిర్వాణ బలమైన కథ. బలమైన భాగోద్వేగాలతో సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. చైతూ, సమంత నటన, థమన్ నేపథ్య సంగీతం సినిమాలో హైలైట్ గా నిలిచాయి. హిట్ టాక్, పోటిలో మరే సినిమా లేకపోవడంతో మజిలీ మంచి కలెక్షన్స్ రాబడుతోంది.

ఇప్పటికే మజిలీ దాదాపు రూ. 30కోట్ల వరకు వసూలు చేసింది. ఐతే, ఈ వారం ‘చిత్రలహరి’ రాకతో ‘మజిలీ’ కలెక్షన్స్ ని గండిపడనుందని భావించారు. కానీ, అలాంటి ఎఫెక్ట్ ఉండేలా కనిపించడం లేదు. చిత్రలహరి మిక్సిడ్ టాక్ సొంతం చేసుకొంది. ఫస్టాఫ్ బాగున్నా.. సెకాంఢాప్ సినిమా స్లో సాగింది. ఎమోషన్స్ ప్రేక్షకుడికి కనెక్ట్ కాలేదు. ఫలితంగా చిత్రలహరిపై మిక్సిడ్ టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎఫెక్ట్ హిట్ టాక్ తో నడుస్తున్న మజిలీ పై పడే ఛాన్స్ లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.