ప్రశాంత్ కిశోర్ ఆఫీసులో జగన్

వైకాపా అధినేత వైస్ జగన్ ఎన్నికల హడావుడి మొదవ్వక ముందు నుంచే ప్రజల్లో తిరుగుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ఏకంగా 341రోజులు పాదయాత్రలోనే ఉన్నాడు. 3,648కిలో మీటర్లు నడిచారు. ఇక, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక.. సభలు, సమావేశాలు, రోడ్ షోలతో ప్రచారంలో దూసుకెళ్లారు. మంగళవారంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. గురువారంతో ఏపీలో ఎన్నికలు ముగిశాయి. దీంతో జగన్ ఫ్రీ అయ్యారు. అలాగని వెళ్లి ఇంట్లో కూర్చోలేదు.

ఇన్నాళ్లు తన కోసం కష్టపడిన వైకాపా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆఫీసు ఐ క్యాప్ కు వెళ్లారు. అక్కడ ఉద్యోగులతో ముచ్చటించారు. ఒకొక్కరితో ప్రత్యేకంగా మాట్లాడారు. వ్యక్తిగత వివరాలని అడిగి తెలుసుకొన్నారు. గత రెండేళ్లుగా వైకాపా కోసం పని చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా జగన్ చాలా ఉత్సాహంగా కనిపించారు. ఆయనలో గెలుపుపై ధీమా కనిపించింది. ఇక, మే 23న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే.