చిత్రలహరి – సమ్మర్ మెగా విజయం

మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి టాక్ అందుకొంది. సినిమాలో తేజు నటించిన విజయ్ పాత్రకు యూత్ కనెక్ట్ అవుతున్నారు. ఆ పాత్రలో తమని తాము చూసుకొంటున్నారు. విజయం కోసం తపించే సాధారణ యువకుడిగా విజయ్ పాత్రని దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దాడు. దర్శకుడి కలం బలం కనిపించింది. మంచి టాక్ తో తొలిరోజు చిత్రలహరికి మంచి కలెక్షన్స్ కూడా దక్కాయి.

ఈ ఆనందంలో శుక్రవారం చిత్రబృందం సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకి చిత్రబృందం కృతజ్ఝతలు తెలిపింది. చాన్నాళ్ల తర్వాత విజయోత్సవ సభలో పాల్గొనందుకు సంతోషంగా ఉందన్నారు తేజు. ‘సమ్మర్ మెగా విజయం’ అంటూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ఓ పోస్టర్ ని కూడా వదిలింది. నిజానికి మొదట మిక్సిడ్ టాక్ వినిపించింది. ఐతే, టాక్ తో సంబంధం లేకుండా సినిమా చూసిన ప్రేక్షకుడు సినిమా బాగుందని కితాబిస్తున్నాడు. తప్పక చూడాల్సిన సినిమాని చెబుతున్నాడు.