‘మహర్షి’పై నెగటివ్ టాక్

‘మహర్షి’ సినిమాపై నెగటివ్ టాక్ మళ్లీ మొదలైంది. ‘మహర్షి’ని దర్శకుడు వంశీ పైడిపల్లి తాపీగా చెక్కుతుండు. ఆయన చెక్కుడు ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. అనుకొన్న టైంకి మహర్షి రావడం కష్టమేననే ప్రచారం జరిగింది. దీనికితోడు సినిమా అనుకొన్న రేంజ్ లో లేదు. బడ్జెట్ రూ. 100కోట్లు చేరుకొందనే వార్తలొచ్చాయ్. వీటినన్నింటికి చెక్ పెడుతూ.. మహర్షి రిలీజ్ డేటు మే 9కి ఫిక్సయింది. రికార్డు స్థాయిలో రూ. 140కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో మహర్షిపై నెగటివ్ టాక్’కి పులిస్టాప పడింది. పాజిటివ్ టాక్ మొదలైంది.

ఇంతలో మరో రకంగా మహర్షి పై నెగటివ్ టాక్ మొదలైంది. మహర్షి తొలిపాట ఫర్వాలేదనిపించింది. ఐతే, రెండో పాటపై మహేష్ అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు. శుక్రవారం విడుదలైన మహర్షి రెండో పాట ‘నువ్వే సమస్తం..నువ్వే సిద్దాంతం, నువ్వే నీ పంతం, నువ్వేలే అనంతం..’ పై నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మహేష్ సినిమాల్లో టైటిల్ సాంగ్స్ అదిరిపోయేలా ఉంటాయి. అతడు నుంచి శ్రీమంతుడు, భరత్ అను నేను సినిమాలో ఆ రేంజ్ కనబడింది.

మహర్షి లో మాత్రం ఆ రేంజ్ పాటలు లేనట్టు కనబడుతోంది. బీట్ ప్రధానంగా సాగిన మహర్షి రెండో పాటలో సాహిత్యాన్ని ట్యూన్ కోసం ఎన్ని ముక్కలుగా విరిచేయాలో అన్ని ముక్కలుగా విరిచేసారు. యాజిన్ నసీర్ పాడిన పాట, పూర్తిగా వెస్ట్రన్ స్టయిల్ లో సాగింది. ట్యూన్ అటు క్యాచీగా లేదు. మహేష్ గత సినిమాల్లోని ఈ తరహా పాటల సరసన ఈ పాట నిలిచే అవకాశాలు తక్కువనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా విడుదలకి ముందే దేవిశ్రీ బయపెడుతున్నాడు. ఇక, నేపథ్య సంగీతం ఎలా ఇస్తాడోనని మహేష్ అభిమానులు భయపడిపోతున్నారు.