పొలిటికల్ ఎంట్రీపై హీరోయిన్ ప్రకటన
రాజకీయాలకి సినిమా చాలా దగ్గరి దారి అని చెబుతుంటారు. సినిమాల్లో రాణించిన చాలామంది రాజకీయాలని శాసించారు. సైఫ్ అలీఖాన్ కూతురు, హీరోయిన్ సారా అలీఖాన్ కూడా రాజకీయాల్లోకి వస్తారట. కాకపోతే ఇప్పుడే కాదు. భవిష్యత్తులో కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను. కానీ అర్ధంతరంగా సినిమాలు వదులుకుని కాదు. నన్ను ఇక్కడి ప్రజలు ఆదరిస్తున్నంత వరకు సినీరంగంలోనే ఉంటాను.
ఆ తర్వాత రాజకీయాల్లోనూ నేనేంటో నిరూపించుకుంటానని చెబుతోంది సారా.
గతేడాది ‘కేదార్ నాథ్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సారా. ఆ తర్వాత ‘సింబా’ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు మంచి విజయాలు అందుకున్నారు. దీంతో ఆమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇక,బాలీవుడ్లోకి రాకముందు సారా ఎక్కువగా చదువు మీదే దృష్టి పెట్టారు. హిస్టరీ, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టుల్లో డిగ్రీ పట్టా అందుకున్నారు.