సన్ రైజర్స్ టార్గెట్ 156

ఉప్పల్ లో హైదరాబాద్ టార్గెట్ 156పరుగులు. ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో దిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లకి ఏడు వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. కొలిన్‌ మన్రో(40), శ్రేయస్‌ అయ్యర్‌(45) రాణించారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో ఖలీల్‌ 3, భువనేశ్వర్‌ 3 వికెట్లు, అభిషేక్‌ శర్మ, రషీద్‌ఖాన్‌ చెరో వికెట్‌ తీశారు.

156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మెన్‌ నిలకడగా ఆడుతున్నారు. డేవిడ్‌ వార్నర్‌(26, 26 బంతుల్లో 1×4, 1×6), జానీ బెయిర్‌స్టో(39, 28 బంతుల్లో 5×4, 1×6) క్రీజులో కొనసాగుతున్నారు.9 ఓవర్లు పూర్తయ్యేసరికి వీరిద్దరూ 66 పరుగులు చేశారు.దిల్లీ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులేస్తుండడంతో పరుగులు రావడం కష్టమవుతోంది.