ప్రకాష్ రాజ్ మాట.. జగన్ సీఎం !

కాబోయే దేశ ప్రధాని ఎవరు ? కంటే కాబోయే ఏపీ సీఎం ఎవరు ? అన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఈసారి కచ్చితంగా వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి అవుతారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు, ఈ ఎన్నికల్లో టీడీపీ 110నుంచి 140 సీట్లు గెలుచుకోబోతుంది. మరోసారి చంద్రబాబు ఏపీ సీఎం అవుతారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.

ఇతర రాష్ట్రా ప్రజలు కూడా ఏపీ ఫలితం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ టాలీవుడ్ నటుడు ఏపీ ఫలితంపై స్పందించారు. గత యేడాది తెదేపాకు భాజాపా, పవన్ భుజం కాశారు. అయినా.. తెదేపా-వైకాపా మధ్య ఒక్కశాతం మాత్రమే ఓట్ల తేడా వచ్చింది. జగన్ చాన్నాళ్ల నుంచి ప్రజల్లో తిరుగుతున్నారు.

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అందుకని.. ఈ సారి వైకాపా గెలుపు పక్కా. కాబోయే ఏపీ సీఎం జగన్ అని చెప్పుకొచ్చాడు ప్రకాష్ రాజు. ప్రకాష్ రాజ్ బీజేపీ వ్యతిరేకి. తెరాస అభిమాని. అందుకే ఆయన జగన్ డబ్బుకొట్టి ఉండవచ్చు. ఫైనల్ గా మే 23న కాబోయే ఏపీ సీఎం ఎవరన్నది తేలనుంది. అప్పటి వరకు ఈ ఊహాగానాలు మాములే.