అన్నీ పాటలు అవసరమా.. మహర్షి ?

తెలుగు సినిమాల్లో ఆరు పాటల కాలం పోయింది. నాలుగు లేదంటే ఐదు పాతలతోనే సినిమా రెడీ అవుతోంది. ఐతే, మహర్షి సినిమాలో ఏకంగా ఎనిమిది పాటలు ఉండబోతున్నాయట. ఇందులో ఆరు స్ట్రయిట్ సాంగ్స్, రెండు బ్యాక్ గ్రవుండ్ మ్యూజిక్ మాదిరిగా వినిపించే సాంగ్స్ అంట. ఇప్పటికే రెండు పాటలని విడుదల చేసింది చిత్రబృందం.

మిగిలిన ఆరు పాటలు క్యూ కట్టనున్నాయి. ఐతే, విడుదలైన రెండు పాటలు కూడా ఓ రేంజ్ లో ఏమీ లేదు. మహర్షి తొలి పాటకు ఫర్వాలేదనే కామెంట్స్ వినిపించాయి. రెండో పాట మాత్రం బాగులేదని చెప్పుకొంటున్నారు. మిగితా నాలుగు పాటలు కూడా ఈ విధంగానే ఉంటే మహర్షి ఆల్భమ్ ప్లాప్ క్రిందే లెక్క.

పాటలు మాత్రమే కాదు. సినిమా నివిడి కూడా ఎక్కువేనట. దాదాపు మూడు గంటల పాటు రుషి జర్నీ ఉంటుందట. ఇవన్నీ మహర్షికి నెగటివ్ అవుతాయా ? పాజిటివ్ అవుతాయా ?? అన్నది చూడాలి. మే 9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంతకంటే ముందు ఘనంగా ప్రీ-రిలీజ్ వేడుకని నిర్వహించనున్నారు. అదెప్పుడు ? అనేది త్వరలోనే ఫిక్స్ కానుంది.