మజిలీ @50కోట్లు

నాగచైతన్య-సమంతల ‘మజిలీ’ బాక్సాఫీస్ దగ్గర హవా చూపిస్తోంది. ఈ సినిమా కలెక్షన్ రూ. 50కోట్లకి చేరాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. చిత్రబృందం ఓ పోస్టర్ ని విడుదల చేసింది. సెన్సబుల్ సమ్మర్ బ్లాక్ బస్టర్ మజిలీ. ప్రేక్షకులకి థ్యాక్స్ అని పోస్టర్ మీద పేర్కొన్నారు.

పెళ్లి తర్వాత చై-సామ్ కలిసి నటించిన తొలి చిత్రమిది. హిట్ టాక్ తో తొలివారమే మజిలీ రూ. 30కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ వీకెండ్ లోనూ అదే జోరు చూపించింది. సమ్మర్ కావడం, తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ముగియడంతో ‘మజిలీ’ కలెక్షన్స్ ఏమాత్రం డ్రాప్ కాలేదు. పోటీలో చిత్రలహరి సినిమా ఉన్నా.. మజిలీ హవా చూపిస్తుండటం విశేషం.

ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. రెండో హీరోయిన్ గా దివ్యాంక కౌశిక్ నటించింది. గోపీ సుందర్ అందించిన పాటలు, థమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర వహించాయి. ఈ చిత్రాన్ని రూ. 25కోట్ల లోపే మైత్రీ మూవీస్ నిర్మించింది. ఇప్పుడీ సినిమా డబుల్ లాభాలని తెచ్చిపెడుతోంది.