నాగబాబు నవ్వడం ఆపడట

మెగా బ్రదర్ నాగబాబు నరసాపురం జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన గెలుస్తాడా ? అన్నది మే 23న తెలియనుంది. ఒకవేళ గెలిచిన నాగబాబు నవ్వడం ఆపడంట. అదేనండీ.. జబర్థస్త్ ప్రోగ్రాం నుంచి తప్పుకోడట. జబర్థస్త్ ప్రోగ్రామ్ కంటెస్టెన్స్ చేసే కామెడీ కంటే నాగబాబు, రోజాల నవ్వులే హైలైట్. నవ్వు వచ్చినా.. రాకున్నా నవ్వేస్తుంటారు. వారిని చూసి టీవీ చూస్తున్న ప్రేక్షకులు నవ్వేస్తారనుకోండీ.. !

జబర్థస్త్ తనని ఆర్థికంగా ఆదుకొంది. నటుడిగా హోదాను పెంచింది. అందుకే నరసాపురం ఎంపీగా గెలిచినా.. జబర్థస్త్ ప్రోగ్రామ్ నుంచి తప్పుకోనని నాగబాబు తెలిపారు. ఇటీవలే నాగబాబు, రోజా ఎన్నికల బిజీలో ఉండటం కారణంగా.. వారి స్థానాల్లో శేఖర్ మాస్టర్, సీనియర్ హీరోయిన్ మీనా కనిపించారు. ఐతే త్వరలోనే నాగబాబు-రోజా జోడీ జబర్థస్త్ స్టేజ్ పై కనిపించనున్నారు.