సుకుమార్’కు నో చెప్పిన నితిన్

సుకుమార్ ప్రకటనలకే పరిమితం అవుతున్నాడు. ‘రంగస్థలం’ హిట్ కిక్కులో ఉండగానే.. ఆయనకి సూపర్ స్టార్ మహేష్ ఆఫర్ ఇచ్చాడు. అయినా.. ఆయనకి సరిపడ కథని రెడీ చేయక సినిమాని వదిలేసుకొన్నాడు. మహేష్ కోసం రెడీ చేసిన కథతోనే ఎన్టీఆర్ ని ట్రై చేశాడు. ఆయన నో చెప్పడంతో.. ఆ కథని తీసుకెళ్లి బన్నీకి చెప్పి ఓకే చేయించుకొన్నాడు. ఫైనల్ గా ఈ సినిమా పట్టాలెక్కడం కూడా కష్టమేననే టాక్ వినిపిస్తోంది.

తన శిష్యుల డైరక్షన్ లో సుకుమార్ నిర్మించే సినిమాల పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నితిన్ సినిమా ఒకటి సెట్ చేశాడు సుక్కు. లైన్ వినిపించి ఓకే చేయించుకొన్నాడు. ఈ సినిమాకు లైన్, కథ కాదు, బౌండ్ స్క్రిప్ట్ కావాలని హీరో నితిన్ పట్టుపట్టాడట. అది ఇప్పటికీ రెడీ కాకపోవడంతో.. ఈ సినిమాని నితిన్ క్యాన్సిల్ చేసుకొన్నట్టు తెలుస్తోంది. ఇలా సుక్కు, ఆయన శిష్యుల సినిమాలు ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి.