తెరాసలోకి రాజాసింగ్.. కండీషన్స్ అప్లై !

తెలంగాణలో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ కారెక్కెందుకు రెడీ అన్నారు. తెరాసలో చేరేందుకు నేను సిద్ధం. కాకపోతే.. నా కండీషన్స్ కు సీఎం కేసీఆర్ ఓకే చెప్పాల్సి ఉంటుందన్నారు రాజాసింగ్. ఇంతకీ కేసీఆర్ కు రాజాసింగ్ పెట్టిన కండీషన్స్ ఏంటో తెలుసా ? అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం, గోవులను రక్షించేందుకు, మతమార్పిడులకు వ్యతిరేకంగా తాము చేస్తున్న ఉద్యమంలో కేసీఆర్ కలిసి రావస్తుందన్నారు.

శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌‌లో శ్రీరామ శోభాయాత్రలో రాజా సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్ పై ఆఫర్ ఇచ్చారు. మరీ.. రాజాసింగ్ కండీషన్స్ కి కేసీఆర్ ఒకే చెబుతారా ? అన్నది చూడాలి. అదే జరిగితే.. తెలంగాణ శాసనసభలో బీజేపీ ఖాళీ అవుతుంది.