సునీల్ మూడులో ఉన్నాడు


కమెడియన్ గా రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత సునీల్ కి తొలి హిట్ దక్కింది. ‘చిత్రలహరి’ సినిమాలో సునీల్ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. తేజూకి ‘గ్లాస్ మేట్‌’గా కనిపించి.. మంచి మార్కులు అందుకున్నాడు. ప్రస్తుతం సునీల్ చేతిలో మూడు పెద్ద ప్రాజెక్టులున్నాయి. త్రివిక్రమ్-బన్నీ సినిమాలో సునీల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సునీల్ కోసం త్రివిక్రమ్ ఓ మంచి పాత్రని రెడీ చేశారట. వి. ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన రవితేజ ‘డిస్కో రాజా’లో సునీల్ కి మంచి పాత్ర దక్కిందట.

ఈ రెండు సినిమాలతో పాటు కొరటాల దర్శకత్వంలో రాబోతున్న మెగాస్టార్ 152 చిత్రంలో సునీల్ నటించబోతున్నాడు. ఈ మూడు సినిమాలు తనని మళ్లీ కమెడియన్ గా టాప్ స్థానంలోకి తీసుకెళ్తాయనే ఆశతో ఉన్నాడు సునీల్. కమెడియన్ గా చేస్తూనే సునీల్ హీరో వేషాలు వేయనున్నారు. ఇదివరకు ఒప్పేసుకొన్న రెండు సినిమాలని సునీల్ పూర్తి చేయనున్నాడు. ఫుల్ టైం కమెడియన్.. పార్ట్ టైం హీరోగా సునీల్ వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది.