విలన్ గా అక్కినేని హీరో ?

బన్నీ-త్రివిక్రమ్ సినిమా కోసం అక్కినేని యువ హీరో సుశాంత్ ని తీసుకొన్నారు. ఈ సినిమాలో ఆయన పప్పుసుద్ద టైపు క్యారెక్టర్ లో కనిపిస్తారనే టాక్ నడుస్తోంది. సుశాంత్ మాత్రం అందుకు భిన్నంగా రెడీ అవుతున్నారు. ఈ మధ్య ఆయన ఎక్కువ టైం జిమ్ లో గడుపుతున్నారు. భారీగా కండలు పెంచుతున్నారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి సుశాంత్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ జిమ్ వీడియో చూస్తే సుశాంత్ విలన్ గా మారబోతున్నట్టు అనిపిస్తోంది. ‘చి.ల.సౌ’తో హీరోగా విజయం దక్కిన తర్వాత సుశాంత్ విలన్ టర్న్ తీసుకోవడం విశేషం. ఇక, ఈ సినిమాలో నవదీప్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ నెల 24 నుంచి బన్నీ-త్రివిక్రమ్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇందులో బన్నీకి జంటగా పూజా హెగ్డే కనిపించనుంది. ఆమె తల్లి పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబుని తీసుకొన్నట్టు తెలుస్తోంది. రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ తో కలిసి హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది.