#AA19 టైటిల్ ‘అలకనంద’ ?

త్రివిక్రమ్-బన్నీ కాంబోలో సినిమా ఈ నెల 24 నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇది కూడా ఫాదర్ సెంటిమెంట్ తో కూడిన కథ. ‘నాన్న నేను’ టైటిల్ అనే అనుకొంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో తండ్రి విపరీతంగా అబద్దాలు ఆడతాడని, కొడుకు దాన్ని నిజాలు చేసే ప్రయత్నం చేస్తుంటాడనే లీకులొస్తున్నాయి. ఈ సినిమా నుంచి మరో గాసిప్ బయటికొచ్చింది.

‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఫాదర్ సెంటిమెంట్ తో చేసినందున.. ఈ సినిమాని తల్లి సెంటిమెంట్ బలంగా వుండేలా తీసుకొస్తున్నారంట. అందుకే టబుని పట్టుబట్టి మరీ తీసుకొచ్చాడట త్రివిక్రమ్. అందుకు తగ్గట్టుగానే ‘అలకనంద’ అనే టైటిల్ అనుకొంటున్నాట. ‘బద్రీనాథ్’ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు అలకనంద. ఆ పేరు చెప్పగానే తమన్నా గుర్తుకు వస్తుంది. #AA19 సినిమాలో అలకనందగా టబు కనిపించబోతున్నారని తెలిసింది. ఐతే, దీనిపై చిత్రబృందం నుంచి అధికార సమాచారం రావాల్సి ఉంది.