‘కిట కిట’ కథతో బన్నీ సినిమా


కథ నచ్చిక దాదాపు యేడాది కాలంగా ఖాళీగా ఉన్నాడు స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్. అలాంటి బన్నీ దర్శకుడు వేణు శ్రీరామ్ చెప్పిన లైన్, వివరించిన బౌండ్ స్క్రిప్ట్ విని ఆగలేకపోతున్నాడట. ఇప్పటికిప్పుడు సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి కూడా రెడీగా ఉన్నాడట. ఇంతకీ వేణు శ్రీరామ్ పట్టుకొచ్చిన కథ ఏంటో తెలుసా ? ఓ పొడుపు కథ. కిటకిట తలుపులు.. కిటారు తలుపులు అంటూ. కళ్లకు సంబంధించిన పొడుపు కథ. బన్నీ కోసం వేణు శ్రీరామ్ రాసుకొన్న కథ కూడా కళ్ల గురించేనని తెలిసింది.

2017లో విడుదలయిన ‘కిట కిట’ (KITA KITA) అనే ఫిలిప్పైన్స్ సినిమా ఆధారం దర్శకుడు వేణు శ్రీరామ్ కథని రాసుకొన్నాడట. ఈ కిటకిట అంటే ‘ఐ విల్ సీ యూ’ అనే ఇంగ్లీష్ అర్థం ఉంది. ఓ అంధురాలు, తను ఇష్టపడే అబ్బాయి కోసం సాగించే అన్వేషణ
అన్నది లైన్. దీనికి ఇంకా చాలా పాడింగ్ వుంది. ఆ లైన్ తీసుకుని బన్నీ కోసం ఐకాన్ కథని రెడీ చేశారట. ఎలాంటి వివాదాలకి తావు లేకుండా రిమేక్ రైట్స్ కూడా తీసుకొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ‘ఐకాన్’ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.