టిక్ టాక్ యాప్ బ్యాన్’కు కేంద్రం ఆదేశం
పబ్ జీ గేమ్, టిక్ టాక్ యాప్ లను బ్యాన్ చేయాలనే డిమాండ్ గత కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్లేస్టోర్ల టిక్ టాక్ యాప్ ను తొలగించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గూగుల్, యాపిల్ సంస్థలను ఆదేశించింది. చైనాకు చెందిన ఈ వీడియో షేరింగ్ యాప్‌పై సర్వత్రా అభ్యంతరం వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే.
మదురైకి చెందిన సీనియర్ న్యాయవాది, సామాజిక కార్యకర్త ముత్తు కుమార్ టిక్ టాక్ యాప్ ని నిషేధించాలని మద్రాసు హైకోర్టులో
పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం టిక్‌టాక్‌పై నిషేధం విధించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ యాప్ ద్వారా రూపొందించిన వీడియోలను ప్రసారం చేయరాదని మీడియాకు సూచించింది. చిన్న పిల్లలు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఏప్రిల్ 16లోగా స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.