#AA19 సెకాంఢాప్ స్క్రిప్ట్ ఇంకా రెడీ కాలె.. !


త్రివిక్రమ్-బన్నీ సినిమా ఈ నెల 24 నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుంది. ఐతే, ఈ సినిమా పూర్తి స్క్రీప్ట్ ఇంకా రెడీ కానట్టు తెలుస్తోంది. ఇటీవల ఫస్ట్ హాఫ్ ఫుల్ నెరేషన్ ఇచ్చేసారు త్రివిక్రమ్. కానీ సెకండాఫ్ ఫ్లో మాత్రమే చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆలస్యం అయినందున, బన్నీ వెనుక మరో రెండు కమిట్ మెంట్స్ వున్నందును సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారు.

దర్శకుడు త్రివిక్రమ్ ఒక పక్క ఫస్ట్ హాఫ్ చేస్తూనే.. సెకండాఫ్ స్క్రిప్ట్ డెవలప్ చేసి, ఫైనల్ నెరేషన్ ఇస్తారని తెలుస్తోంది. మరో దర్శకుడు అయితే.. పూర్తి స్క్రిప్ట్ లేనిదే బన్నీ సినిమాని మొదలెట్టేవాడు కాదు. త్రివిక్రమ్ కాబట్టి బన్నీ ఆ సాహాసం చేస్తున్నారు. ఇక, త్రివిక్రమ్ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉండనుంది. అంతకంటే ముందే బన్నీతో సినిమా చేసేందుకు వేణు శ్రీరామ్ బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉన్నాడు.