కింగ్ ఫ్యాన్స్ కోసం ‘మన్మథుడు2’ లీక్

కింగ్ నాగార్జున తాజా చిత్రం మన్మథుడు 2. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ఇటీవలే సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. అప్పుడే సినిమా లీకైంది. నాగ్ ఫిట్ నెస్ కి సంబంధించిన సీన్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐతే, ఈ సీన్ ని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్వయంగా లీక్ చేయడం విశేషం. ‘నాగ్ ఫిట్ నెస్ గోల్స్ కి ఫిదా అయిన రాహుల్ రవీంద్రన్.. ఈ ఒక్క సీన్ మాత్రం కింగ్ ఫ్యాన్స్ కోసం’ అంటూ రెండు పిక్స్ ని లీక్ చేశాడు. ఇందులో నాగ్ ఫిట్ నెస్ కోసం ఏ రేంజ్ లో కష్టపడతున్నాడు.త్రివిక్రమ్-నాగ్ కలయికలో వచ్చిన ‘మన్మథుడు’ సూపర్ హిట్ అయ్యింది. సినిమాలో వినోదంలో హైలైట్ గా నిలిచింది. మన్మథుడు 2 కూడా ఆ రేంజ్ లోనే ఉండనుందట. ప్రతి సీన్ సరదాగా ఉంటుందట. ఈ మేరకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే క్లూ ఇచ్చింది. ఐతే, స్టోరీ లైన్ ఏంటీ ? అనేది ఇంకా తెలియరాలేదు. యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులని ఆకట్టుకొనే రెండో మన్మథుడు రాబోతున్నాడని తెలుస్తోంది.