జున్నుగాడికి సారీ చెప్పిన నాని
నేచురల్ స్టార్ నాని ముద్దుల తనయుడి ముద్దుపేరు జున్ను. జున్నుగాడి అసలు పేరు అర్జున్. ‘జెర్సీ’ సినిమాలో నాని అర్జున్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అంటే తనయుడు పేరుని నాని వాడేసికొంటున్నాడు అన్నమాట. ఇందుకు జున్నుగాడికి సారీ చెప్పాడు నాని. సముద్రం ఒడ్డున తన తనయుడుతో కూర్చుని కబుర్లు చెబుతున్న ఫొటోని నాని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఫోటోలో నాని వేసుకున్న టీషర్ట్‌పై అర్జున్ అని రాసుంది. ఈ ఫొటోకు.. ‘సారీ రా జున్నూ… తప్పలేదు’ అని క్యాప్షన్ ఇచ్చాడు.
ఇప్పుడీ ఫోటో నెటిజన్స్ తెగ ఆకట్టుకుంటోంది. ‘అన్నా.. జెర్సీ కోసం వెయిటింగ్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. గౌతమ్ తిన్నమూరి దర్శకత్వంలో నాని-శ్రద్దా శ్రీనాథ్ జంటగా నటించిన చిత్రం ‘జెర్సీ’. రేపు (ఏప్రిల్ 19) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నాని 36 యేళ్ల క్రికెటర్ అర్జున్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాపై నాని గట్టి నమ్మకంతో ఉన్నారు. జెర్సీ బ్లాక్ బస్టర్ హిట్.. అంతకుమించిన విజయం సాధిస్తుందని.. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో నాని చెప్పిన సంగతి తెలిసిందే.
Sorry ra Junnu …తప్పలేదు 😉 pic.twitter.com/z6RPybO7Ec
— Nani (@NameisNani) April 18, 2019