కేసీఆర్ ని టార్గెట్ చేసిన వర్మ


వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనే ప్రచారం జరిగింది. ఇప్పుడది నిజమైంది. గురువారం వర్మ.. కేసీఆర్ బయోపిక్ ని ప్రకటించారు. టైటిల్ పోస్టర్ ని వదిలారు. ‘టైగర్ కేసీఆర్’ అనే టైటిల్ ని పెట్టారు. ‘ది అగ్రెసివ్ గాంధీ’ అనే ట్యాగ్ లైన్. ఈ టైటిల్ కు ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’ అనే లైన్ ను జతచేశారు. టైటిల్ ని బట్టి చూస్తే.. కేసీఆర్ జీవితంలోని పాజిటివ్ అంశాలని వర్మ చూపించబోతున్నట్టు తెలుస్తోంది.

కేసీఆర్ బయోపిక్ తీస్తే.. ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుందనే విషయాన్ని తెరపై ఆవిష్కరిస్తానని వర్మ గతంలో చెప్పాడు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఎందుకు మొదలు పెట్టాడు. దాని వెనక ఉన్న బలమైన కారణాలు. కేసీఆర్ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది. కేసీఆర్ సంకల్ప బలం ప్రధాన లైన్ గా సినిమా ఉండబోతున్నట్టు టాక్. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు మొదలెట్టినట్టు తెలుస్తోంది. బహుశా.. త్వరలోనే టైగర్ కేసీఆర్ ని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశాలున్నాయి.