‘వాల్మీకి’ లుక్ చూశారా.. ?
చాలా కూల్ గా కెరీర్ ని స్టార్ట్ చేశాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఆయనలో మెగా హీరోల ఫైర్ లేదని కామెంట్స్ వినిపించాయి. అవేవి తేజు పట్టించుకోలేదు. ఎవరినీ అనుకరించలేదు. ఏ ఇమేజ్ కోసం పాకులాడలేదు. మెగా హీరోలకి భిన్నంగా, మెగా బ్రాండ్ కు భిన్నంగా సినిమాలు చేసుకొంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో ‘ఫిదా’తో తొలి విజయాన్ని అందుకొన్నాడు. ‘తొలిప్రేమ’తో మరో హిట్ కొట్టాడు. ‘ఎఫ్2’ మెగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. మధ్యలో కంచె, అంతరిక్షం లాంటి ప్రయోగాలు చేశాడు.
వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘వాల్మీకి’. హారీష్ శంకర్ దర్శకుడు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ శుక్రవారం హైదరాబాద్ లో మొదలైంది. హైదరాబాద్ పరిస ప్రాంతాల్లో దాదాపు 35రోజుల పాటు షూటింగ్ నిర్వహించనున్నారు. ఈ సినిమాలోని తన లుక్ ని వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకొన్నాడు. ఇందులో వరుణ్ చెవిపోగు, గడ్డం లుక్ లో ఊరమాస్ గా కనిపిస్తున్నాడు. సినిమాలో ఆయనది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రని చెబుతున్నారు. దానికి తగ్గట్టుగానే వాల్మీకి లుక్ ఉంది. ఆ లుక్ ని మీరు ఓ సారి చూసేయండీ.. !
Treading a new path!#Valmiki pic.twitter.com/jiKQRIWO5U
— Varun Tej Konidela (@IAmVarunTej) April 18, 2019