‘మజిలీ’తో ‘జెర్సీ’ తేడా అదే.. !
ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగచైతన్య ‘మజిలీ’ చిత్రం క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ. దీనికి నాని ‘జెర్సీ’ సినిమాకు పోలికలు ఉన్నట్టు అనిపించింది. ఇవాళ జెర్సీ ప్రేక్షకుల ముందుకు రావడంతో.. ఈ రెండు చిత్రాల మధ్య పోలికా ఎంటన్నది తెలిసిపోయింది.
‘మజిలీ’ చిత్రం క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ. అందులోను ప్లాష్ బ్యాక్ నేరేషన్ లో జరిగే దశాబ్దకాలం క్రితం కథ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. అయితే ఆ సినిమాకు …జెర్సీకు తేడా ఏంటంటే…జెర్శి పట్టుదల ఉంటే లక్ష్యానికి వయస్సుతో నిమిత్తం లేదని ఓ జెనరేషన్ కు స్పూర్తినిచ్చే కథ. ‘మజలీ’ మాత్రం కొన్ని మర్చిపోకపోతే మరికొన్ని మిస్సైపోతామని హెచ్చరించే కథ. రెండూ వేర్వేరు.
మజిలీ యే ఎమోషనల్ జర్నీ అనుకొంటే.. దాన్ని మించేలా జెర్సీ ఉంది. జీవితంలో ఇంకేమీ చెయ్యలేము అనుకుని మిడిల్ లైఫ్ క్రైసిస్ ని ఎదుర్కొనే వ్యక్తి.. మళ్లీ తనను ప్రూవ్ చేసుకుని తనకు ఆత్మధైర్యాన్ని, తన కొడుక్కు గర్వాన్ని గిప్ట్ గా అందిస్తాడు అనేది చూపించటంలో డైరక్టర్ పూర్తి గా సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా పూర్తిగా దర్శకుడు ప్రతిభా ప్రదర్శన అనే చెప్పాలి. నాని సిక్సర్స్ కొట్టి సినిమాని గెలిస్తే. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచారు.