కపిల్’తో కపిల్ ప్రాక్టీస్ (వీడియో)

1983లో కపిల్‌ దేవ్‌ సారథ్యంలో టీమిండియా ప్రపంచకప్‌ గెలిచిన నేపథ్యంలో ‘83 సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కపిల్‌ దేవ్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నారు. క్రికెటర్ కృష్ణ‌మాచారి శ్రీకాంత్ పాత్ర‌లో త‌మిళ న‌టుడు జీవా న‌టిస్తున్నాడు.

1983 వరల్డ్‌కప్ ఫైనల్లో అప్పటి డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారి టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ టీమ్ సక్సెస్ స్టోరీ ఆధారంగా 83 మూవీ రూపొందుతుంది. హిందీ, తెలుగుతో పాటు పలు భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సినిమాలో రణ్ వీర్ సింగ్ కోచ్ గా నవాజుద్దీన్ సిద్దిఖీ నటిస్తున్నారు. ఈ సినిమా కోసం కపిల్ కూతురు అమియా దేవ్‌ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. 2020 ఏప్రిల్ 10న‌ గుడ్ ఫ్రైడే కానుకగా 83ని విడుదల కానుంది.

తాజాగా, ఈ సినిమా కోసం ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్న న‌టులు చేస్తున్న ప్రాక్టీస్‌కి సంబంధించిన వీడియో విడుదల చేశారు. ఇందులో ర‌ణ్‌వీర్‌కి ద‌గ్గ‌రుండి మ‌రీ క‌పిల్ ట్రైనింగ్ ఇస్తుండ‌డం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ వీడియో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఆ వీడియోని మీరు చూసేయండీ.. !