మహేష్ సినిమాలో బాలీవుడ్ ఫ్లేవర్
మహేష్ ‘భరత్ అనే నేను’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత మహేష్ చేస్తున్న ‘మహర్షి’ సినిమా ఏకంగా రూ. 150కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని చెబుతున్నారు. మహేష్ తర్వాతి సినిమా ఎఫ్ 2 దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఉండనుంది. ఈ సినిమాని చాలా గ్రాండ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా లేడీ సూపర్ స్టార్ విజయ్ శాంతి రీ-ఎంట్రీ ఇవ్వనుంది. అంతేకాదు.. ఇందులో పలువురు బాలీవుడ్ సీనియర్ నటీనటులు కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.
మహేష్ తన దర్శకులకి మంచి రెమ్యూనరేషన్ ఇప్పిస్తుంటారు. అనిల్ రావిపూడికి రూ. 12కోట్ల రెమ్యూనరేషన్ మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇక, ఈ సినిమా బడ్జెట్ కోసం అనిల్ రూ. 50కోట్లు అడిగారట. అది కూడా మహేష్ రెమ్యూనరేషన్ కాకుండా. ప్రస్తుతం మహేష్ కి ఉన్న మార్కెట్ దృష్ట్యా అది చాలా తక్కువ. డిజిటిల్, హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలోనే ఆ మొత్తం వచ్చే ఛాన్స్ ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. దసరా కానుకగా సినిమా విడుదలని ప్లాన్ చేస్తున్నారు.