బాబు మీరు ప్రజా సేవలో ఉండాలె : కేటీఆర్

ఏపీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. తెరాస వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ ట్విటర్ వేదికగా చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

“ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టిన రోజులు మీరు మరెన్నో జరుపుకోవాలని. ఎక్కువ కాలం ప్రజా సేవలో గడాపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా”’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.