కోహ్లీకే మన్కడింగా.. !
ఐపీఎల్ 12లో మన్కడింగ్ ఫేమస్ అయిపోయింది. ఎలెవన్ పంజాబ్ స్కిప్పర్ రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ ద్వారానే రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మన్ బట్లర్‌ను ఔట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అశ్విన్ కొందరు తప్పు పట్టారు కూడా. ఆయన క్రీడా స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడనే కామెంట్స్ వినిపించాయి. ఐతే, మన్కడింగ్ కూడా ఆటలో ఓ భాగమన్నది అశ్విన్ వాదన.
ఈ విషయం పక్కన పెడితే.. విరాట్ కోహ్లీ మన్కడింగ్ నుంచి తప్పించుకొన్నారు. శుక్రవారం కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో సునీల్ నరేష్ కోహ్లీని మస్కడింగ్ ద్వారా అవుట్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. బెంగళూరు ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్ అది.
సునీల్ నరైన్ బౌలర్. చివరి బంతికి కోహ్లీని మస్కడింగ్ చేసేందుకు ప్రయత్నించారు. కోహ్లీ వెంటనే బ్యాటును క్రీజులో పెట్టాడు.
అంతటితో ఆగకుండా మోకాళ్లపై కూర్చుని బ్యాటును పూర్తిగా క్రీజులో పెడుతూ.. ఇప్పుడు మన్కడింగ్ చేయ్ అంటూ నరైన్‌ను ఆటపట్టించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ శతకం బాది ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ను అందుకున్నాడు.
https://www.iplt20.com/video/173848/mankading-me-no-says-virat