మ్రోగిన పరిషత్‌ ఎన్నికల గంట

తెలంగాణలో మరోసారి ఎన్నికల గంట మ్రోగింది. పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి ఎన్నికల తేదీల వివరాలను ప్రకటించారు. మూడు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన వివరించారు.

మే 6న తొలి దశ, మే 10న రెండో దశ, మే 14న మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి. మే 27న ఓట్ల లెక్కింపు జరగనుంది. తొలి దశ పోలింగ్‌కు ఈనెల 22న, రెండో దశకు ఈనెల 26న, మూడో దశకు ఈనెల 30న నోటీసులు విడుదల కానుంది. రాష్ట్రంలోని 538 జడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

గత యేడాది చివరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక ఈ యేడాది ఆరంభంలోనే పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ నెలలోనే లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఇంకా ఆఫలితాలు రాకముందే మళ్లీ పరిషత్ ఎన్నికల నోటీఫికేషన్ విడుదలైంది. ఐతే, పరిషత్ ఎన్నికలతో తెలంగాణలో ఎన్నికల కాలంలో వెళ్లిపోనుంది.