వైరల్ : ధావన్ మస్కడింగ్ ఫీట్

ఈ ఐపీఎల్‌లో మస్కడింగ్ సంచలనం రేపింది. రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మన్‌ బట్లర్‌ను పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మన్కడింగ్‌ ద్వారా పెవిలియన్‌కు పంపించాడు. అప్పట్నుంచి ఏదో ఒక మ్యాచ్‌లో మన్కడింగ్‌ అంశం తొంగి చూస్తూనే ఉంది.
కోల్ కతాతో చేసిన మ్యాచ్ లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మస్కడింగ్ ని గుర్తు చేసుకొని బౌలర్ సునీల్ నరేన్ ఆటపట్టించాడు.

శనివారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఢిలీ ఆటగాడు శిఖర్ ధావన్ అశ్విన్ ఇదే తరహా ఆటపట్టించాడు. మ్యాచ్ లో అశ్విన్‌ మూడో ఓవర్‌ మూడో బంతి వేయడానికి పరుగెత్తుకొచ్చి ఒక్కసారిగా ఆగిపోయాడు. నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ధావన్‌కు మన్కడింగ్‌ గుర్తొచ్చి క్రీజులోనే నిల్చుండిపోయాడు. ఆ తర్వాత బంతి వేస్తున్న సమయంలో శిఖర్‌ ‘పరుగెత్తుతున్నా.. వీలైతే మన్కడింగ్‌ చెయ్‌’ అని అశ్విన్‌ వైపు చూస్తూ.. పరిగెత్తినట్లు నటించాడు. దీనికి సంబంధించిన వీడియోను వైరల్ అవుతోంది.

ఇక, ఈ మ్యాచ్ లో ఢిలీ 5 వికెట్ల తేడాతో పంజాబ్ ని ఓడిచింది. ధావన్ అర్థసెంచరీతో ఢిలీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.