‘మజిలీ’ డిలీటెడ్ సీన్ చూస్తారా.. ?


నాగచైతన్య-సమంతల ‘మజిలీ’ సూపర్ హిట్ అయ్యింది. శివ నిర్వాణ దర్శకత్వంలో సామ్-చై ‘మజిలీ’ తెరకెక్కింది. ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిట్ టాక్ సొంతం చేసుకొంది. ఏకంగా రూ. 50కోట్లకిపైగా వసూలు చేసింది. ఇప్పటికీ కలెక్షన్స్ నిలకడగా ఉన్నాయి. ఐతే, చిత్రలహరి, జెర్సీ సినిమాల నుంచి ‘మజిలీ’ తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో మజిలీ చిత్రబృందం ప్రమోషన్స్ కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా సినిమా డిలీటెడ్ సీన్స్ ఒక్కొక్కటిగా వదులుతోంది.

ఇప్పటికే మజిలీ నుంచి రెండు డిలీటెడ్ సీన్స్ బయటికొచ్చాయి. ప్రేక్షకులని బాగా ఆకట్టుకొన్నాయి. ఇప్పుడు మజిలీ నుంచి మరో డిలీటెడ్ సీన్ రాబోతుంది. నాగ చైతన్య-దివ్యాంక కౌశిక్ ల మధ్య రొమాంటి సీన్ అది. ఈ సీన్ ఈరోజు సాయంత్రం 4గంటలకి రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. సినిమాలోనూ చైతూ-దివ్యాంకల లవ్ ట్రాక్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకొంది. ఐతే, దాన్ని చై-సామ్ ల మధ్య నడిచిన ఎమోషనల్ ట్రాక్ డ్యామినేట్ చేసిందనే కామెంట్స్ వినిపించాయి.