తారక్’పై నందమూరి ఫ్యాన్స్ ఫైర్.. ఎందుకంటే ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై నందమూరి అభిమానులు ఫైర్ అవుతుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏ విషయంలో తారక్ అభిమానులని నొప్పించాడు ? అంటే.. నాని ‘జెర్సీ’ సినిమాపై తారక్ రియాక్ట్ కావడం. జెర్సీ సినిమా అద్భుతంగా ఉంది. సినిమాని దర్శకుడు గౌతమ్ తిన్నమూరి గొప్పగా తీశాడు. నాని అద్భుతంగా నటించాడు అంటూ.. తారక్ ట్విట్టర్ వేదికగా చిత్రబృందంపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఇదే నందమూరి అభిమానులకి నచ్చలేదు.

ఈ యేడాది జనవరిలో ఎన్టీఆర్ బయోపిక్ తొలిభాగం ‘ఎన్టీఆర్-కథానాయకుడు’, ఫిబ్రవరిలో రెండోభాగం ‘ఎన్టీఆర్-మహానాయకుడు’ ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు మంచి సినిమాలు అనిపించుకొన్నా.. కమర్షియల్ గా ఆడలేదు. ఐతే, ఎన్టీఆర్ బయోపిక్ పై తారక్ మాట కూడా మాట్లాడలేదు. తాత బయోపిక్ ని ప్రమోట్ చేసే ప్రయత్నమే చేయలేదు. కనీసం ట్విట్టర్ వేదికగా అయినా.. తాత బయోపిక్ బాగుందని ఒక్క ట్విట్టు చేయలేదు. ఇప్పుడు నాని జెర్సీని ఏ రేంజ్ లో మెచ్చుకొంటూ ట్విట్ చేశాడు తారక్. అదే నందమూరి అభిమానులకి నచ్చలేదు. అందుకే తమ ఆగ్రహాన్ని తారక్ పై చూపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.