హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టులోకి నాని.. !

నేచురల్ స్టార్ నాని ఇకపై క్రికెటర్ గా కొనసాగాలని, ఆయన ఐపీఎల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ తరుపున ఆడాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. నాని క్రికెటర్ అర్జున్ పాత్రలో నటించిన ‘జెర్సీ’ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి.. మెగా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొంది. ప్రేక్షకులు, సినీ స్టార్స్ నుంచి ప్రశంసలు అందుకుంటోంది. స్టార్ హీరోలు తారక్, బన్నీ.. జెర్సీ చూసి ఫిదా అయిపోయారు. దర్శకుడు గౌతమ్ తిన్నమూరి సినిమాని గొప్పగా తీశాడు. నాని అద్భుతంగా నటించాడని కితాబిచ్చారు.

తాజాగా, ‘జెర్సీ’పై టాలీవుడ్ సన్సెషనల్ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. ”జెర్సీ’ తనని ఉత్కంఠకి గురి చేసింది. ఉక్కరి బిక్కిరి చేసింది. సినిమాలో లీనమైపోయా. నాని ప్రేమలో పడిపోయా. ఇకపై కూడా నాని ఈ రేంజ్ సినిమాలో చేయాలని కోరుకుంటున్నా’నని ట్విట్ చేశాడు విజయ్. అంతేకాదు.. ‘నాని స్ట్రయికింగ్ అద్భుతంగా ఉంది. ఐపీఎల్ హైదరాబాద్ సన్ రైజర్స్ తరుపున ఆడితే బాగుంటుందంటూ.. ‘ చమత్కరించాడు విజయ్.