మూడో విడత పోలింగ్‌ : పోలింగ్ శాతం ఏ రాష్ట్రంలో ఎంత ?

సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 115 నియోజవకర్గాల్లో పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు దేశవ్యాప్తంగా మొత్తం 61.31శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా పశ్చిమ్‌ బంగలో 78.94 శాతం, అత్యల్పంగా జమ్ముకశ్మీర్‌లో 12.46శాతం పోలింగ్‌ నమోదైంది.

రాష్ట్రాల వారీగా నమోదైన పోలింగ్ శాతాలు :

* అసోం – 74.05

* బిహార్‌ – 54.95

* ఛత్తీస్‌గఢ్‌ – 64.03

* గోవా – 70.96

* గుజరాత్‌ – 58.81

* జమ్ము కశ్మీర్‌ – 12.46

* కర్ణాటక – 60.87

* కేరళ – 68.62

* మహారాష్ట్ర – 55.05

* ఒడిశా – 57.84

* త్రిపుర – 71.13

* ఉత్తర్‌ప్రదేశ్‌ – 56.36

* పశ్చిమ్‌ బంగ – 78.94

* దాద్రానగర్‌ హవేలి – 71.43

* డామన్‌ డయ్యూ – 65.34