జెర్సీ దర్శకుడుకి తారక్ బంపర్ ఆపర్

జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారమ్. తనకోసం ఓ కథ రెడీ చేయమని కోరాడట. జెర్సీ సినిమా కంటే ముందే గౌతమ్ తారక్ కి తెలుసట. గతంలో తారక్ కి ఓ కథ కూడా వినిపించాడట గౌతమ్. అందుకే ‘జెర్సీ’ సినిమాపై తారక్ స్పందించారని చెబుతున్నారు.

లెటెస్ట్ న్యూస్ ఎంటంటే ? గౌతమ్ తదుపరి సినిమా తారక్ ఉండే ఛాన్స్ ఉంది. తన కోసం ఓ మంచి కథని రెడీ చేసుకొని తీసుకురమ్మని స్వయంగా తారక్ నే గౌతమ్ ని కోరాడట. ఇన్నాళ్లు జెర్సీ సినిమాతో బిజీగా ఉన్న గౌతమ్ కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకొని.. ఆ తర్వాత తారక్ కోసం కథని రెడీ చేసే పనిని మొదలెట్టబోతున్నట్టు తెలుస్తోంది.

జెర్సీ సినిమాపై దర్శకధీరుడు రాజమౌళి, బన్నీ, తారక్.. తదితరులు ప్రశంసలు గుప్పించారు. గౌతమ్ జెర్సీ సినిమాని గొప్పగా తీశాడు. నాని అర్జున్ పాత్రలో అద్భుతంగా నటించాడని కితాబిచ్చారు. ప్రస్తుతం జెర్సీ థియేటర్స్ లో హవా చూపిస్తోంది. మంచి కలెక్షన్స్ రాబడుతోంది.